MDK: జిల్లాలో జనగణన ప్రక్రియకు సంబంధించి సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్ల నియామకం పూర్తయిందని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఈ నెల 26 నుంచి మే 10 వరకు నిర్వహించే ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ పై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. కులగణన సంచాలకులు భారతి హోలికేరి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొని ఈ వివరాలను వెల్లడించారు.