MNCL: ఆదివాసి, గిరిజన గ్రామాలలో మౌలిక సౌకర్యాల కల్పనకు అనుమతులు ఇవ్వాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు కోరారు. రాష్ట్ర మంత్రి సీతక్కతో కలిసి ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అటవీ ఆంక్షలతో మారుమూల ఆదివాసీ, గిరిజన గ్రామాలలో మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. రోడ్లు, డ్రైనేజీలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇప్పించాలన్నారు.