HNK: దామెర మండలంలోని ల్యాదెళ్ల అంబేద్కర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి రెడ్ క్రాస్ ఛైర్మన్ డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి రూ.20,000 విరాళంగా ప్రకటించి విగ్రహ కమిటీకి అందజేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన బాటలో నడుస్తూ సమాజాభివృద్ధిలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన అన్నారు.