MLG: వేసవి కాలంలో సరదా కోసం నదులు, కాల్వలు, చెరువుల్లో ఈతకు వెళ్లి ప్రాణాల్ని ప్రమాదంలో పెట్టుకోవద్దని గోవిందరావుపేట మండలం పస్రా ఎస్సై తాజుద్దీన్ హెచ్చరించారు. భద్రతా నియమాలు పాటించకుండా జలాశయాల్లోకి దిగడం అత్యంత ప్రమాదకరమని మంగళవారం తెలిపారు. ‘మీ ప్రాణం మీ కుటుంబానికి అమూల్యం’ అని పేర్కొంటూ, ప్రజలు అప్రమత్తంగా ఉండి సురక్షితంగా ఉండాలని సూచించారు.