పెద్దపల్లి మండలం రాగినేడు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని శ్రీ నిత్య ఇస్రో యువ సైంటిస్ట్ ప్రోగ్రాం (యువిక 2026)కు ఎంపికైంది. ఉమ్మడి జిల్లా నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థి శ్రీ నిత్యను ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. మూడవసారి పాఠశాల నుంచి ఈ కార్యక్రమానికి విద్యార్థులు ఎంపికై హ్యాట్రిక్ సాధించారని గైడ్ టీచర్ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.