కోనసీమ: అంబేడ్కర్ జయంతి సందర్భంగా SP రాహుల్ మీనా ఆదేశాలతో ఆలమూరు పరిధిలోని నర్సిపూడిలో సోమవారం రాత్రి గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. ఉత్సవాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని CI విద్యాసాగర్ సూచించారు. ఫ్లెక్సీలు, డీజేలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.