RRతో మ్యాచ్‌లో అభిషేక్ డకౌట్ అయిన సంగతి తెలిసిందే. అతను ఈ ఏడాది ఆడిన 18 T20ల్లో డకౌట్ కావడం ఇది ఏడో సారి. ఇందులో 6 సార్లు క్యాచ్ ఔట్‌గానే వెనుదిరిగాడు. దీంతో అభి షాట్ సెలక్షన్‌పై శ్రద్ధ వహించి, తొలి నుంచే బౌండరీలు కొట్టాలనే ఆలోచన వదిలేయాలని క్రికెట్ ఫ్యాన్స్ సూచిస్తున్నారు. ఇక ఈ ఏడాది అభి తర్వాత కూపర్ కనోలీ 17 ఇన్నింగ్స్‌ల్లో 4 సార్లు డకౌట్ అయ్యాడు.