NGKL: కొల్లాపూర్ డివిజన్ కేంద్రంలో యూటీఎఫ్ (UTF) ఉపాధ్యాయ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని సంఘం నాయకులు కలెక్టర్ బాదావత్ సంతోష్‌కు వినతిపత్రం సమర్పించారు. ఉపాధ్యాయుల సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలకు భవనం అవసరమని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఆర్. కృష్ణ, నారాయణ, శంకర్ తదితరులు పాల్గొని సమస్యను వివరించి త్వరితగతిన స్థలం కేటాయించాలని కోరారు.