CTR: ఆటోలో మర్చిపోయిన సెల్ ఫోన్ తిరిగి అప్పగించిన ఆటో డ్రైవర్ చంద్రశేఖర్‌ను సీఐ సోమశేఖర్ రెడ్డి అభినందించారు. పట్రపల్లెకు చెందిన యాస్మి వీకోట మార్కెట్ యార్డ్ నుంచి వైయస్సార్ సర్కిల్ వరకు గోవింద్ నగర్‌కు చెందిన చంద్రశేఖర్ ఆటోలో ప్రయాణం చేసింది. ఆటో దిగే సమయంలో అందులో సెల్ ఫోన్ మర్చిపోయింది. దానిని గుర్తించిన అతడు పోలీస్ స్టేషన్లో అప్పగించాడు.