ATP: గుంతకల్లులోని దోనిముక్కల ప్రాంతంలో యాస్మిన్ (15) అనే బాలిక బుధవారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సెల్ఫోన్ చూడొద్దని తల్లి మందలించినందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.