MHBD: పట్టణంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలో శుక్రవారం UTF MJP వింగ్ ఆధ్వర్యంలో బోధన, బోధనేతర సిబ్బంది నిరసన తెలిపారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. PRC నివేదిక అమలు, పెండింగ్ డీఏల విడుదల, CCS రద్దు చేసి ఓపీఎస్ అమలు, గురుకుల పాఠశాలల టైమ్ టేబుల్ మార్పు, 010 పద్దు కింద వేతనాల చెల్లింపు, తదితర డిమాండ్లు నెరవేర్చాలన్నారు.