KMM: తిరుమలలో శ్రీవారిని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య శుక్రవారం దంపతులు దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు వారికి ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేశారు. స్వామివారి అనుగ్రహాలతో నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషంగా, సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.