WGL: దుగ్గొండి మండల పరిషత్ కార్యాలయంలో ఈరోజు 15వ ఆర్థిక సంఘం నిధుల సమర్థ వినియోగంపై అవగాహన సమావేశం నిర్వహించారు. డివిజనల్ పంచాయతీ అధికారి కే. రాజీవ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు నిధుల వినియోగ విధానాలు, పారదర్శకత, పనుల ప్రాధాన్యతపై వివరించారు. గ్రామ అభివృద్ధికి సర్పంచ్ కార్యదర్శులు కృషి చేయాలని కోరారు.