CTR: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యాబోధన ఉంటుందని పులిచెర్ల మండలం కల్లూరు పాఠశాల కమిటీ ఛైర్మన్ అష్రఫ్ అలీ తెలిపారు. విద్యార్థుల తల్లితండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలలో కల్పించే సౌకర్యాలపై కరపత్రాలను ఆయన పంచిపెట్టారు. పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఉత్తమ ఫలితాలు నమోదవుతున్నాయన్నారు.