AKP: నర్సీపట్నంకు చెందిన యువతి పెదిరెడ్ల చైత్రదీపిక తైవాన్‌లో జరుగుతున్న అంతర్జాతీయ రోలర్ స్కేటింగ్ పోటీల్లో మెరిసింది. యూత్ కేటగిరీలో షో గ్రూప్, ఇన్లైన్ విభాగాల్లో రెండు రజత పతకాలు, సోలో డాన్స్‌లో కాంస్య పతకం సాధించింది. వరుసగా నాలుగోసారి అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలుచుకోవడం విశేషం. గతంలో ఆస్ట్రేలియాలో మూడు స్వర్ణాలు సాధించారు.