VKB: తాండూరు పట్టణంలోని పాఠశాలల ముందు ప్రమాదాల నివారణకు జీబ్రా క్రాసింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన రహదారులపై వీటిని వేయడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని అధికారులు తెలిపారు. ఇదే క్రమంలో ప్రధాన చౌరస్తాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.