ఆదిలాబాద్ రిమ్స్‌లో నిర్వహించిన రోడ్డు భద్రత సదస్సులో ఏడీజీపీ డాక్టర్ అనిల్ కుమార్, ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు. హెల్మెట్ ధరించడం, సురక్షిత ప్రయాణంపై 250 మంది విద్యార్థులకు అవగాహన కల్పించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిని పట్టుకున్న సెక్యూరిటీ సిబ్బందికి హెల్మెట్లు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రాణాలు కాపాడుకోవాలన్నారు.