హీరో తిరువీర్ తన జీవితంలోని తీరని వేదనను పంచుకున్నాడు. షూటింగ్ షెడ్యూల్స్, లుక్ కంటిన్యూటీ నిబంధనల వల్ల తన తల్లిదండ్రుల అంత్యక్రియలు, కర్మకాండలను శాస్త్రోక్తంగా నిర్వహించలేకపోయానని చెప్పాడు. ఒక్కగానొక్క కొడుకై ఉండి కూడా కనీసం జుట్టు కూడా తీయలేవా అన్న బంధువుల విమర్శలు తనను క్రుంగదీశాయని, వృత్తి కోసం చేసిన ఈ త్యాగం కలిగించిన గిల్ట్ జీవితాంతం ఉంటుందని భావోద్వేగానికి లోనయ్యాడు.