ASR: అరకులోయ, డుంబ్రిగూడ మండలాల్లో శనివారం ఉదయం విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ఈఈ పి. వేణుగోపాల్ తెలిపారు. అరకు 33/11 కేవీ సబ్స్టేషన్ పరిధిలో సుంకరమెట్ట ఫీడర్లో మరమ్మత్తులు, చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.