బాపట్ల పరిధిలోని సూర్యలంకలో పర్యాటక అభివృద్ధి పేరిట మత్స్యకారుల ఇళ్లను తొలగించడం దుర్మార్గమని సీపీఎం జిల్లా కార్యదర్శి గంగయ్య అన్నారు. ఏళ్లుగా ఇక్కడ నివసిస్తున్న 35 కుటుంబాలకు ఇళ్లు ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని ఖండించారు. బుధవారం తహసీల్దార్ ఆఫీసు వద్ద బాధితులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు.