CTR: డీలిమిటేషన్ను విపక్షాలను అనగదొక్కే సాధనంగా ఉపయోగించరాదని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తెలిపారు. పార్లమెంటులో శుక్రవారం ఆయన మాట్లాడారు. ప్రాంతీయ అసమానతలు లేకుండా చూడాలన్నారు. డీలిమిటేషన్ బిల్లును స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలన్నారు. ఏపీలో మహిళల భద్రత ఆందోళనకరంగా మారిందన్నారు.