ప్రసవం తర్వాత మహిళల్లో కనిపించే మతిమరుపును ‘మామ్స్ బ్రెయిన్’ అంటారు. బిడ్డ సంరక్షణలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనిని తగ్గించుకోవడానికి బాలింతలు పోషకాహారం తీసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు, పప్పు దినుసులు ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మెదడు చురుగ్గా మారుతుంది.