KMR: ఇంటర్ ఫలితాల్లో 992 మార్కులతో రాష్ట్రస్థాయి 5వ ర్యాంక్ సాధించిన హోంగార్డు సిద్దరాములు కుమార్తె నిమితను ఎస్పీ రాజేష్ చంద్ర ఘనంగా సత్కరించారు. నిమిత పట్టుదల, అంకితభావం అందరికీ స్ఫూర్తిదాయకమని ఎస్పీ కొనియాడారు. పేదరికాన్ని జయించి ఆమె సాధించిన ఈ విజయంపై జిల్లావ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.