JGL: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని దుర్గాబాయి దేశముఖ్ మహిళా టెక్నికల్ శిక్షణ సంస్థలో పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు జిల్లా సంక్షేమ అధికారి నరేశ్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. అనాథ, అక్రమ రవాణా బాధిత, వికలాంగ బాలికలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.