సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 19న జరిగే ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. 6వ తరగతి కోసం 10 కేంద్రాల్లో 1,200 మంది, 7-10 తరగతుల కోసం 644 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. 6వ తరగతి పరీక్ష ఉదయం 10 నుండి 12 వరకు, మిగిలిన తరగతులకు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు జరుగుతుందని వివరించారు.