TG: రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లో ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో శాంతిభద్రతల కంటే రోడ్డు ప్రమాదాలే పెద్ద సవాలుగా మారాయని పేర్కొన్నారు. గతేడాది 800 హత్యలు జరిగితే, ప్రమాదాల్లో ఏకంగా 7500 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ రోడ్డు భద్రతలో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలిపారు.