VSP: జీవీఎంసీ 120 వార్డుల పునర్విభజనలో జనాభా అసమానతలు ఉన్నాయని మాజీ కార్పొరేటర్ పీ.ఎల్.వి.ఎన్.మూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. శుక్రవారం జీవీఎంసీ అధికారికీ వినతి అందచేసారు. కొన్ని వార్డుల్లో జనాభా 25 వేలకే పరిమితం కాగా, మరికొన్నింటిలో 17 వేలకే ఉంచారని తెలిపారు. ఇది ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని పేర్కొంటూ సమీక్షించి సవరించాలని కోరారు.