PDPL: విద్యార్థుల రక్షణ కోసం పొత్కపల్లి గ్రామ పాఠశాలల ముందు ఎస్సై రమేశ్ రోడ్డు భద్రతా సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారి పక్కనే పాఠశాలలు ఉన్నందున, వాహనదారులు వేగాన్ని తగ్గించి జీబ్రా క్రాసింగ్ వద్ద అప్రమత్తంగా ఉండాలన్నారు. అధిక వేగం ప్రాణాంతకమని, విద్యార్థుల రాకపోకల సమయంలో నియమాలు పాటించాలన్నారు. పాఠశాల పరిసరాల్లో జాగ్రత్తగా వాహనాలు నడపాలన్నారు.