SRPT: నడిగూడెం మండలంలోని రత్నవరం గ్రామ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పుల్లయ్య మాట్లాడుతూ.. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బోధనా నైపుణ్యాలను పెంపొందించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.