ATP: రాప్తాడు నియోజకవర్గంలోని తాగునీటి సమస్యలపై ఎమ్మెల్యే పరిటాల సునీత మంగళవారం అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా 30 ఏళ్ల క్రితం నాటి సత్యసాయి నీటి పథకం ఆధునీకరణకు రూ. 50 కోట్లు, మరో 38 గ్రామాల్లో కొత్త నీటి సౌకర్యం కోసం రూ. 55 కోట్లు మంజూరు చేయాలని కోరారు.