బాపట్ల సూర్యలంక రోడ్డులోని భావపురి బ్రాహ్మణ సదన్‌లో ఆదివారం పుస్తకావిష్కరణ సభ జరిగింది. డాక్టర్ వాసిరాజు రాధాకృష్ణ మూర్తి రచించిన ‘క్లైమేట్ చేంజ్ అండ్ అగ్రికల్చర్’, ‘గ్లోబల్ అండ్ ఇండియన్ హొరైజన్స్ ఆఫ్ హయ్యర్ అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్’ పుస్తకాలను మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఘనంగా ఆవిష్కరించారు.