W.G: పెదమైనవానిలంకలో శనివారం రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో మత్స్యకారులకు బోట్లు, వలల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ పంపిణీ ఏర్పాట్లను జేసీ టి. రాహుల్ కుమార్ రెడ్డి గురువారం పర్యవేక్షించారు. సుమారు 100 బోట్లను లబ్ధిదారులకు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమం విజయవంతం చేసేలా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.