AKP: దేవరాపల్లి ఎంపీడీవో కార్యాలయంలో శనివారం జరిగిన సామాజిక తనిఖీ మండల ప్రజావేదికలో ఉపాధి హామీ పనుల్లో లోపాలు బయటపడ్డాయి. 27 పంచాయతీల్లో రూ.21.18 కోట్లతో చేపట్టిన 1297 పనులపై సోషల్ ఆడిట్లో తేడాలు గుర్తించారు. ఫీల్డ్ అసిస్టెంట్ల నిర్లక్ష్యంపై రూ.15 వేల అపరాధ రుసుము విధించారు. లోపాలను వెంటనే సరిచేయాలని అధికారులు ఆదేశించారు.