KRNL: పెద్దపాడు వద్ద మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదరుగా వస్తున్న కారును ఓ పెళ్లి వాహనం ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో పెళ్లికూతురితోసహా పలువురు గాయపడినట్లు సమాచారం. పెళ్లి బృందం గూడూరు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను కర్నూలు ఆస్పత్రికి తరలించారు.