VSP: పరవాడలో పైడిమాంబ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి పరవాడ బీసీ కాలనీకి చెందిన పైలా రాధాకృష్ణ దంపతులు రూ.1,00116 విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం చెక్కును గ్రామ సర్పంచ్ ఎస్. అప్పలనాయుడు, పైల శ్రీనివాసరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు పి. అప్పారావు, చుక్క రాము నాయుడు పాల్గొన్నారు.