BPT: చీరాల పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్ (రోటరీ సామాజిక భవనం)లో ఈ నెల జూన్ 7న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. పెదకాకాని శంకర కంటి ఆసుపత్రి, రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల, జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరం ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ను గురువారం రోజున రోటరీ క్లబ్ ప్రతినిధులు విడుదల చేశారు.