కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరాకు అడ్వకేట్ పవన్ కుమార్ వినతి పత్రం అందజేశారు. ఫిబ్రవరి 21న 4వ పట్టణ సీఐ విక్రమ సింహాతో జరిగిన వివాదాన్ని పరస్పర చర్చలతో సఖ్యంగా పరిష్కరించుకున్నామని, ఎవరి ప్రమేయం లేదని, ఎవరిపై చర్యలు తీసుకోవద్దని లిఖితపూర్వకంగా కోరారు. ఈ అంశం ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.