E.G: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్సీ సోము వీర్రాజు శుక్రవారం రాజమండ్రిలో ఆవిష్కరించారు. అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లో విస్తరింపజేయడంతో పాటు, యువతలో క్రీడాస్ఫూర్తి, ఐక్యత, క్రమశిక్షణ వంటి విలువలను క్రీడలు ఉపయోగపడతాయన్నారు.