ATP: అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్లో ఖాళీగా ఉన్న ఏఎన్ఎం పోస్టు భర్తీకి సంబంధించి ప్రొవిజనల్ జనరల్ మెరిట్ జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాను జిల్లా అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ప్రిన్సిపల్ డా.విజయశ్రీ తెలిపారు. అభ్యర్థులు తమ అభ్యంతరాలను ధ్రువపత్రాలతో ఏప్రిల్ 18లోపు సమర్పించాలని సూచించారు.