అన్నమయ్య: కర్ణాటకలోని హోస్కోట వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లగుట్లపల్లికి చెందిన శ్రీహరి (27) దుర్మరణం చెందారు. బెంగళూరులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న శ్రీహరి, స్వగ్రామంలో పనులు ముగించుకుని బైక్పై బెంగళూరుకు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. కొడుకు మృతితో నల్లగుట్లపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.