PLD: పల్నాడు కలెక్టరేట్లో శనివారం మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని, మొక్కజొన్న రైతులకు మార్చి నెలాఖరు వరకు సాగునీరు అందించాలని స్పష్టం చేశారు. అలాగే, కోటప్పకొండకు రెండో ఘాట్ రోడ్డు నిర్మించాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు.