KKD: సామర్లకోట మండలం హుస్సేన్‌పురం గ్రామానికి చెందిన ముప్పిడ ప్రణీత నేషనల్ స్థాయి కరాటే పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించారు. జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు నిమ్మకాయల రంగనాద్ ప్రణీతను పూలమాలతో సత్కరించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల పట్ల ఆసక్తి చూపాలని, ప్రభుత్వ సహాయం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.