E.G: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సోమవారం 8వ డివిజన్లో పర్యటించి డ్రైనేజీ సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతంలో గంటల తరబడి నిలిచే డ్రైనేజీ నీరు ప్రస్తుతం 10 నిమిషాల్లోనే బయటకు వెళ్లేలా మెరుగుపరచామన్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.80 లక్షల అభివృద్ధి పనులను ప్రతిపాదిస్తున్నామని తెలిపారు.