TPT: సూళ్లూరుపేట మండలం దామా నెల్లూరు గ్రామం అటవీ ప్రాంతంలో కోళ్ల పందాలు నిర్వహిస్తున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 4 కోళ్లు, 4 కత్తులు, 5 బైకులు, రూ.10,200 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై అజయ్ కుమార్ తెలిపారు.