సత్యసాయి: కదిరి రూరల్ మండలం ఎగువపల్లి హరిజనవాడకు చెందిన వై.హరి ప్రమాదవశాత్తు మరణించడంపై ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ విచారం వ్యక్తం చేశారు. కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మృతుడి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిరుపేద కుటుంబానికి జరిగిన ఈ నష్టం తీరనిదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.