SRD: తెలంగాణ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం నారాయణఖేడ్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. పెండింగ్లో ఉన్న PRCని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టర్ ఉమా హారతికి వినతిపత్రం అందజేశారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరారు.