TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్రపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి ప్రజల్లోకి వెళ్లని వారు, ఇప్పుడు యాత్రలంటున్నారని ఎద్దేవా చేశారు. గతంలో తాను BRSను టార్గెట్ చేశానని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాత్రమే సమస్యలు తీర్చగలదు కాబట్టి ఇప్పుడు ఆ పార్టీపైనే దృష్టి పెట్టానన్నారు. కొందరు BRS మాజీ MLAలు తనను కలిశారని ఈ సందర్భంగా వెల్లడించారు.