ASR: జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి దివ్యాంగుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ టీ.నిశాంతి తెలిపారు. జిల్లా వికలాంగుల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పాడేరులో పలువురు దివ్యాంగులకు కలెక్టర్ వీల్ చైర్స్, వినికిడి యంత్రాలు తదితర సహాయక పరికరాలను అందజేశారు. అర్హులైన వారు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.