SRPT: రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే సామేలు అన్నారు. ఇవాళ నూతనకల్ మండలం ఎర్ర పహాడ్ లో ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.