షార్ట్స్ ధరించడం వల్ల లైంగిక వేధింపులు పెరుగుతాయని తమిళనాడు నేషనల్ లా యూనివర్సిటీ వీసీ నాగరాజు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనికి నిరసనగా విద్యార్థులు షార్ట్స్ ధరించి పరిపాలనా భవనం ముందు ఆందోళన చేపట్టారు. వీసీ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేయగా, సంస్థ ప్రతిష్ట దృష్ట్యా విద్యార్థుల వస్త్రధారణ ముఖ్యమని ఆయన తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.